Header Banner

కేంద్రం నుండి మరో కీలక ప్రాజెక్ట్! భారీ పెట్టుబడితో ప్రణాళికలు.. AMC భాగస్వామ్యంగా బంపర్ ఆఫర్!

  Fri Apr 18, 2025 13:40        Politics

ఆంధ్రప్రదేశ్‌లో మరో గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఈ కొత్త గ్రీన్ అల్యూమినియం ప్రాజెక్ట్‌ కోసం ఏఎంజీ మెటల్స్, గ్రీన్ కో గ్రూప్, రియో టింటో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. తీర ప్రాంతంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడనుంది. ప్రాజెక్ట్‌ మొత్తం ఖర్చు రూ.60,000 కోట్లుగా అంచనా వేయగా, రియో టింటో మరియు ఏఎంజీ మెటల్స్ తలో 50 శాతం వాటాలు కలిగి ఉంటాయి. ప్లాంట్‌ నిర్వహణ కోసం 2 గిగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉపయోగించనున్నారు, ఇది గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.

 

ఈ అల్యూమినియం స్మెల్టర్ ప్రారంభంలో ఏడాదికి 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై, భవిష్యత్తులో దాన్ని 10 లక్షల టన్నులకు, అంతకుమించి 20 లక్షల టన్నుల కెపాసిటీ వరకు విస్తరించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో హిందాల్కో, వేదాంత వంటి కంపెనీలు టాప్‌లో ఉన్నా, ఈ ప్రాజెక్ట్ అవి కలిపిన దానికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. భూసేకరణ విషయమై ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాంట్ నిర్మించనున్నారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంతో కూడిన భారీ ఆర్థిక లాభాలను తీసుకురానుంది.

 

ఇది కూడా చదవండిచల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికిదేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #greenaluminium #apmegaproject #gamchangerproject #riotinotoinap #greenkoenergy